KDP: కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు మండలం బొడిశెట్టి పల్లె గ్రామానికి ఎస్సీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. వెంటనే స్పందించిన వారు ఈతగాల్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు.