SKLM: ఎల్.ఎన్.పేట బొర్రంపేటలో సర్పంచ్ బొడ్డేపల్లి రవణమ్మ అధ్యక్షతన సోమవారం గ్రామ సభను నిర్వహించారు. బొర్రంపేట గ్రామాన్ని సరుబుజ్జిలి మండలంలోకి మార్చాలని ఇటీవలే సర్పంచ్‌తో పాటు కొందరు జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. కలెక్టర్ సూచన మేరకు ఎంపీడీవో పైడి శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజల అందరి ఆమోదాన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.