ELR: మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో సోమవారం భీమడోలు మండల గ్రామాల్లో ఏలూరు డీఎల్డీవో లక్ష్మీ, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో పద్మావతి పర్యటించారు. పొలసానిపల్లి, భీమడోలు, వడ్లపట్ల, నరెడ్లగూడెం, పూళ్ల గ్రామాల్లో డీఎల్డీవో, తహసీల్దార్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుపాను నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.