SKLM: తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఆమదాలవలస ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గ ప్రత్యేక అధికారి డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి అధికారి, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలిలని ముఖ్యంగా నదీ పరివాహ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలి అని అన్నారు.