అన్నమయ్య: మదనపల్లె జిల్లా ఏర్పాటులో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్, రెడ్డి సాహెబ్ అన్నారు. సోమవారం మదనపల్లె నందు పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. యువగళంలో నాడు నారా లోకేష్, అలాగే చంద్రబాబు నాయుడు జిల్లా ప్రకటన పై ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అనంతరం ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.