ASF: దహేగాం మండలంలో శ్రావణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. కుల వివక్ష కారణంగా శ్రావణి దారుణ హత్యకు గురైందని అన్నారు. కుల వివక్షకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.