KDP: పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలోని కలసపాడు, కాశినాయన, మండలాల ప్రజలు మొంత తుఫాన్ ప్రభావం 2 రోజులపాటు ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు వహించాలని సీఐ శ్రీనివాసులు తెలిపారు. పాడుబడిన భవనాల్లో నివాసం ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు పొలాల్లో జాగ్రత్తలు వహించాలని ఆయన అన్నారు. అనంతరం మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారన్నారు.