VZM: జిల్లాలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బిఎస్ఎన్. మూర్తి ఇటీవల శ్రీనగర్‌లో జరిగిన 10వ ఆల్ ఇండియా పోలీసు జూడో క్లస్టర్ పోటీల్లో రజత పతకం సాధించిన నేపథ్యంలో సోమవారం జిల్లా ఎస్పీ దామోదర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మూర్తి క్రీడా ప్రతిభను ఎస్పీ ప్రశంసించారు. త్వరలో జిఎస్ఈ (గుడ్ సర్విస్ ఎంట్రీ) అందజేస్తామని తెలిపారు.