W.G: ముంథా తుఫాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో పలచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆకివీడు నగర పరిధిలోని సమతా నగర్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.