SRCL: కోనరావుపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా స్నిగ్ధ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంఛార్జ్ ఎంపీడీవోగా పనిచేసిన గూడ శంకర్ రెడ్డి నుంచి ఆమె బాధ్యతలు చేపట్టారు. విధుల్లోకి చేరిన స్నిగ్ధకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. మండల అభివృద్ధికి, పరిపాలనలో పారదర్శకతకు కృషి చేస్తానని నూతన ఎంపీడీవో స్నిగ్ధ పేర్కొన్నారు.