KDP: మొంథా తుఫాన్ నేపథ్యంలో వృద్ధులు బయట తిరగొద్దని MPDO ఫణి రాజకుమారి సోమవారం హెచ్చరించారు. సోమవారం ఆమె తన కార్యాలయంలో మాట్లాడుతూ…మొంథా తుఫాను ప్రభావం వల్ల 28,29 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్ధవటం జడ్పీ ఉన్నత పాఠశాలలో పునరావాసం కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చెరువులు, నదులు, కుంటల వద్దకు పిల్లలు వెళ్లకుండా తల్లి దండ్రులు చూసుకోవాలన్నారు.