VZM: జిల్లాలో తుఫాన్ సంసిద్ధతపై చర్యలను స్వయంగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సోమవారం గంట్యాడ, ఎస్ కోట, ఎల్ కోట, జామి మండలాలలో సుడిగాలి పర్యటన జరిపి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా గంట్యాడ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్, విధుల కేటాయింపులో లోపాలను గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు.