KMR: కామారెడ్డి పట్టణం గర్గుల్ శివారులో ఆత్మహత్య చేసుకున్న ఏఆర్ కానిస్టేబుల్ రేకులపల్లి జీవన్ రెడ్డి(37) ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ఎస్పీ రాజేష్ చంద్ర కుటుంబ సభ్యులను కలిసి ఆరా తీశారు. ఘటనా స్థలికి చేరుకోని వివరాలు సేకరించారు. భార్యాభర్తల మధ్య గొడవలే ప్రధాన కారణమని, ఇటీవల విడాకుల నోటీసు పంపించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.