MBNR: శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం 8:00 గంటలకు పల్లమరి గ్రామంలోని ఉద్దాల చాట వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అనంతరం మధ్యాహ్నం 1:00 గంటకు చిన్న వడ్డేమాన్ గ్రామంలో ఉద్దాల కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా కురుమూర్తి స్వామి భక్తులు, ఆయా గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.