HYD: డయాబెటిక్ పేషెంట్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రాకేశ్ సహాయ తెలిపారు. ఉస్మానియాలో డయాబెటిక్ ఫుట్ క్లినిక్ ద్వారా రోగులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కాళ్లకు తిమ్మిర్లు, స్పర్శ లేకపోవడం, గాయాలు నయం కాకపోవడం వంటి లక్షణాలు కనిపించే వారు తప్పనిసరిగా ఈ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.