ప్రకాశం: ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం నందు 52 మంది లబ్ధిదారులకు 60 లక్షల 99 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని ఆయన అన్నారు. అనంతరం పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.