HNK: ఎంజీఎం ఆసుపత్రిలో ఓకే బెడ్‌పై ఇద్దరు రోగులు, ఓకే సిలిండర్‌కు ఇద్దరు చిన్నారులకు వైద్యం అందిస్తున్నారని బంధువులు ఆరోపించిన సంఘటనపై HIT TVలో వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే నేడు జిల్లా అదరపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఎంజీఎం ఆస్పత్రి సందర్శించి రోగులకు కావలసిన వసతులపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకొని, ప్రతిపాదన పంపాల్సిందిగా డాక్టర్లను ఆదేశించారు.