CTR: చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రస్తుతం ఉన్న మార్గంతో పాటు, రెండవ దారి ఏర్పాటుపై అధికారులు పరిశీలన చేపట్టారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు.. అపోలో యాజమాన్యం, కమిటీ సభ్యులు, నగరపాలక అధికారులు సంయుక్తంగా సోమవారం మధ్యాహ్నం రెండవ దారి ఏర్పాటుపై పరిశీలన చేశారు.