JN: జనగామ జిల్లా ప్రభుత్వ బాలసదనం బాలికలు హైదరాబాద్లో విజ్ఞాన విహారయాత్రకు సోమవారం వెళ్లారు. కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాలతో జరిగిన ఈ యాత్రలో విద్యార్థినులు సాలార్జంగ్ మ్యూజియం, నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శించి ఆనందించారు. చదువుతో పాటు బయటి ప్రపంచం గురించి తెలుసుకునే మంచి అవకాశం పిల్లలకు లభించిందని జిల్లా సంక్షేమ అధికారి ఫ్లోరెన్స్ అన్నారు.