సత్యసాయి: తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం రూ.116 కోట్లు వ్యయంతో సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని తెలిపారు. కదిరి నియోజకవర్గంలో 43 వేల మందికి రూ.19 కోట్లు, తలుపుల మండలంలో 6,777 మందికి రూ.3.5 కోట్లు, పెద్దన్నవారిపల్లిలో 756 మందికి రూ.33 లక్షల పింఛన్లు అందజేస్తున్నామని అన్నారు.