AP: దేశ జనగణనకు సంబంధించి రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయింది. సెన్సస్ ప్రీ టెస్ట్‌కు సంబంధించి రంగం సిద్ధం చేసింది. 2027లో జరిగే తొలిదశ జనాభా గణనకు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్ర సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇళ్లు, అందులో నివాసితుల లెక్కింపును అధికారులు చేపడుతారు.