SIR ప్రక్రియపై ఈసీ కీలక ప్రకటన చేసింది. బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహిస్తామని తెలిపింది. అయితే ఇప్పటికే మొదటి ఫేజ్ ముగిసిందని.. రెండో విడతగా తొలుత 12 రాష్ట్రాలతో సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ చేస్తామని ప్రకటించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమన్నారు. బీహార్లో విజయవంతంగా ఎస్ఐఆర్ ముగిసిందన్నారు.