ADB: దేశ ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ తగ్గించడం వలన సామాన్యునికి వరంలా మారిందని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ పేర్కొన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని మార్కెట్ పరిసర ప్రాంతాలలో వ్యాపారులను కలిసి వారితో ముచ్చటించారు. జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే లాభాలను వారికి వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు.