ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలనుసారం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. మొంధా తుఫాన్ ముందస్తు నివారణ చర్యలు, అత్యవసర సహాయక చర్యలు చేపట్టుటకు క్రింది నెంబర్లను సంప్రదించాలన్నారు. ఈ మేరకు జూనియర్ అసిస్టెంట్ 9700727807, హెల్త్ అసిస్టెంట్ 7893114370 పట్టణ ప్రజలు వినియోగించుకోవాలన్నారు.