KMM: అకాల వర్షాలను ప్రకృతి వైపరీతంగా గుర్తించి కరువు మండలంగా ప్రకటించాలని CPM నాయకులు దివ్వెల వీరయ్య, మద్దాల ప్రభాకరరావు అన్నారు. మంగళవారం ఎర్రుపాలెం మండలం తహసిల్దార్ కార్యాలయం ముందు రైతుల సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గత పది రోజులుగా వివిధ గ్రామాలలో దెబ్బతిన పంటలను పరిశీలించిన నాయకులు సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేశారు.