VZM: జిల్లా ఎస్పీ ఎఆర్. దామోదర్ ఆదేశాలతో గుర్ల మండలంలో ఉన్న చంపావతి నది ప్రవాహ ప్రాంతాల్లో స్థానిక ఎస్సై పి.నారాయణరావు సోమవారం సందర్శించారు. నది ప్రవాహ ప్రాంతాలను పరిశీలించి అక్కడ నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచించారు. పాత భవనాల వద్ద గాని, చెట్ల వద్ద గాని ఉండరాదని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.