KDP: సిద్దవటం మండలం కనుమలోపల్లిలో వెలసిన శ్రీ మానసాదేవి ఆలయంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త సిరిగళ్ళ లక్ష్మయ్య ఆధ్వర్యంలో అమ్మవారిని పుష్పమాలికలతో అత్యంత సుందరంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన తర్వాత భక్తులు అమ్మవారిని దర్శించుకుని కాయకర్ఫూరం సమర్పించి మ్రొక్కులు తీర్చుకున్నారు.