KNR: శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో 210 పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు పశు వైద్యా ధికారి మాధవరావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్, అజహర్, గోపాలమిత్రలు శ్రీనివాస్, మొండయ్య, రైతులు పాల్గొన్నారు.