ADB: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 2025-27కు మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. దరఖాస్తుదారుల మధ్యన లక్కి డ్రా ద్వారా షాపుల ఎంపికను పారదర్శకంగా చేపట్టామన్నారు. దుకాణాల ఎంపికలో రిజర్వేషనను కూడా అమలు చేశామన్నారు. 40దుకాణాలకు గాను 34 దుకాణాలకు డ్రా చేశామని, 6 దుకాణాల డ్రాను వాయిదా వేశామని తెలిపారు.