NLR: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లాలో సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నిధులను విడుదల చేసింది. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ఉన్నత అధికారులు తెలిపారు.