GNTR: ఫిరంగిపురం మండలం వేమవరంలోని కోటిలింగాల దేవస్థానంలో కార్తీక సోమవారం పర్వదినాన భక్తులతో కోలాహలం నెలకొంది. వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చి, దేవస్థానంలో కొలువైన మరకత లింగానికి అభిషేకం చేశారు. కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.