కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఉత్తర్వుల మేరకు తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా కొత్తపేటలోని బాలుర బాలిక వసతి గృహాలు హాస్టల్స్ భవనాలను రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, కొత్తపేట ఎస్సై సురేంద్ర పరిశీలించారు. హాస్టల్ భవనాలు సరిగా లేనియెడల వేరే ప్రదేశానికి విద్యార్థులను తరలించే ముందస్తు సహాయ చర్యలో భాగంగా తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు.