ELR: కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా భీమడోలు వ్యాప్తంగా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. భీమడోలు భీమేశ్వరస్వామి ఆలయం, పొలసానిపల్లి రామలింగేశ్వరస్వామి, గుండుగొలను బ్రమరాంభ మల్లేశ్వరస్వామి, అంబరుపేట ఉమారామలింగేశ్వరస్వామి, పూళ్ల సకలేశ్వరస్వామి ఆలయాల వద్ద తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. శివునికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు.