SKLM: సరుబుజిలి మండలంలో ప్రతిపాదిత థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు ధర్నాకు బయలుదేరిన పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావును స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.