తిరుపతి: దొరవారిసత్రం మండల పరిధిలో తుఫాన్ ‘మొంథా’ ప్రభావం కారణంగా భారీ గాలులు, వర్షాలు కురుస్తాయని ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి కుంటలు, వాగులు, వంకలు దగ్గరకు వెళ్ళవద్దని చెప్పారు. ప్రజలు ఇల్లు విడిచి బయటకు వెళ్లకపోతే మంచిదని తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు.