E.G: గంగవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన అయ్యప్ప స్వామిలు ఆదివారం సాయంత్రం గోకవరానికి చెందిన విశ్వహిందూధర్మ పరిరక్షణ రామ్ సేన అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావును కలిశారు. ఈ సందర్భంగా వారు నెల్లిపూడి గ్రామంలో పడిపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మీ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఆయన వెంటనే స్పందించి రూ .15000 ఆర్థిక సహాయం అందజేశారు.