ELR: వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నూజివీడు డివిజన్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న సోమవారం అన్నారు. డివిజన్లోని 125 గ్రామాల్లో ప్రభుత్వ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. డివిజన్లోని ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు.