NDL: రుద్రవరం మండలం వెలగలపల్లి గ్రామ శివార్లలో వెలసిన శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. వేద పండితులు, భక్తులు అభిషేకాలు, అష్టోత్తర పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివలింగాన్ని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం కమిటీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.