ATP: రాయదుర్గం నియోజకవర్గ రైతులు పండించిన మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. దళారులు కనీస మద్దతు ధర రూ. 2,400కు బదులుగా రూ. 1,700కే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు నష్టం జరుగకుండా వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.