ఇండోర్లో ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ల పట్ల అసభ్య ప్రవర్తన ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ స్పందించారు. అంతర్జాతీయ క్రీడాకారులు తమ బస నుంచి బయటకు వెళ్లేటప్పుడు అధికారులకు, భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. క్రికెట్ ప్లేయర్లకు చాలా పాపులారిటీ ఉంటుందని, వారు బయట తిరిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.