KDP: APలో డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పంది. డ్వాక్రా మహిళల పిల్లల విద్య, వివాహాల కోసం కొత్త రుణ పథకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. స్త్రీనిధి బ్యాంకు ద్వారా గరిష్టంగా రూ.1 లక్ష వరకు రుణాలను పావలావడ్డీకే అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డల వివాహాలకు తక్కువ వడ్డీకే లోన్ ఇవ్వనున్నారు.