ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో గాయపడిన భారత స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా అయ్యర్‌ను ICUకి తరలించినట్లు తెలుస్తోంది. క్యాచ్ పట్టేటప్పుడు బంతి అతని పక్కటెముకలను బలంగా తాకడంతో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతున్నట్లు డాక్టర్లు గుర్తించారని సమాచారం. దీంతో అయ్యర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.