KMM: Dy.CM మల్లు భట్టి విక్రమార్క మంగళవారం మధిర నియోజకవర్గంలో పర్యటించనున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా కోరారు. సోమవారం నిర్వహించిన డివిజన్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రూ.43 కోట్ల విద్యుత్తు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు.