NZB: బోధన్ మండలం బాన్సువాడ ప్రధాన రహదారి ఘన్పూర్ క్రాస్ రోడ్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తులను చికిత్స నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.