E.G: కొవ్వూరు మండలం కాపవరం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ బోల్తా కొట్టింది. దేవరపల్లి వైపు నుంచి కొవ్వూరు వైపు బియ్యం లోడుతో వెళ్తున్న లారీ.. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108 వాహనంలో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.