అన్నమయ్య జిల్లాలో కలకడ పోలీసులు రూ.12 లక్షల విలువైన 34 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో సరఫరా చేపట్టిన 14 మందిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ మేరకు గంజాయితోపాటు మూడు బైకులు, ఒక ఆటో, 14 సెల్ఫోన్లను పోలీసులు శనివారం జప్తు చేశారని ఎస్పీ ధీరజ్ తెలిపారు.