అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలంలోని పించా డ్యాం నుంచి సోమవారం 4730 క్యూసెక్కుల నీరు విడుదలయ్యింది. ఈ మేరకు గేటు-1 ద్వారా 2520 క్యూసెక్కులు, గేటు-3 ద్వారా 2210 క్యూసెక్కులు విడిచినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 4113 క్యూసెక్కులుగా ఉంది. బహుదానదిలో నీటి ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు