VZM: తెర్లాం MRO జి. హేమంత్ కుమార్ స్థానిక పనుకువలసలో మంచినీటి పథకాలను సోమవారం పరిశీలించారు. తుఫాను, వర్షాలకు తాగునీరు కలుషితమైయ్యే అవకాశముందని, మంచినీటి పథకంలో క్లోరినేషన్ చేయాలని ఈ సందర్భంగా పంచాయతీ అధికారులకు ఆయన సూచించారు. ప్రజలంతా కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. గ్రామంలోని చెరువులను పర్యవేక్షించాలని వీఆర్వోను ఆదేశించారు.