AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంథా తుఫాన్‌గా మారడంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా 43 రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో రద్దు చేసిన రైళ్ల జాబితాను విడుదల చేసింది. తమ ప్రయాణానికి ముందు ప్రయాణికులు రైలు స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ జాబితాలో గోదావరి ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది.