ATP: చెన్నేకొత్తపల్లి మండలంలో రూ. 2.94 కోట్లతో జరుగుతున్న న్యామద్దల – చిన్నప్పేట రహదారి పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించారు. 3 కి.మీ తారు రోడ్డు పూర్తవగా, సీసీ రోడ్డు, కల్వర్టు పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ఇతర గ్రామాలకు మంజూరైన రూ.7 కోట్ల విలువైన రోడ్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆమె పేర్కొన్నారు.